డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!

- April 13, 2026 , by Maagulf
డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ (Degree Online Services Telangana–DOST) నోటిఫికేషన్‌ను సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు.విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి విడతకు సంబంధించిన స్పష్టమైన గడువును బోర్డు ప్రకటించింది:

మొదటి విడత: ఏప్రిల్ 15న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుకు మే 7 వరకు అవకాశం ఉంటుంది.
రెండో విడత: మే 15 నుండి మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మూడో విడత: మే 31న ప్రారంభమై జూన్ 15తో ముగుస్తుంది.
అర్హత కలిగిన విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com