మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- April 13, 2026
ఇంగ్లాండ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల క్రికెట్‌ను మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.ఈ టోర్నీలో మొత్తం రూ.81 కోట్లను (87,64,615 డాలర్లు) బహుమతిగా అందించనున్నారు.
2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ ఫండ్ 10 శాతం పెరిగింది. గత ఎడిషన్‌లో 10 జట్లు పాల్గొనగా, ఈసారి పోటీలో జట్ల సంఖ్య 12కు చేరింది. 2024లో మొత్తం ప్రైజ్ మనీ రూ.70 కోట్లుగా ఉండగా, జట్ల పెరుగుదలకు అనుగుణంగా ఐసీసీ నిధులను కూడా భారీగా పెంచింది.
ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకునే విజేత జట్టుకు రూ.21.8 కోట్లు లభించనున్నాయి. ఫైనల్ వరకు వచ్చి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.10 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్ వరకు చేరుకుని ఓటమి పాలైన జట్లకు కూడా భారీ మొత్తంలో అంటే రూ.6 కోట్ల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.
కేవలం విజేతలకే కాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు ఐసీసీ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి రూ.29 లక్షలు అదనంగా అందుతాయి. అంతేకాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లను కేటాయించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







