ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- April 13, 2026
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ కు చెందిన ఓడరేవుల దిగ్బంధనం మొదలు పెట్టారు.అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో అమెరికా ప్రతిచర్యకు దిగింది. ట్రంప్ ఆదేశాలతో అమెరికా నౌకాదళం భారీగా బలగాలను దింపింది. ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటున్నాయి యూఎస్ దళాలు. ఏ దేశమైనా సరే తమ అనుమతులు తీసుకోవాల్సిందేనని అమెరికా తేల్చి చెప్పింది.
ఓడరేవుల దిగ్బంధం పై ఇరాన్ సీరియస్ అయ్యింది. అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఇరాన్. తమ ఓడరేవులకు ముప్పు వాటిల్లితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ చెప్పింది.పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఓడరేవులను ధ్వంసం చేస్తామని ప్రకటించింది.
ఇరాన్ ఇప్పటి దాకా ఏదైతే వ్యూహం అమలు చేసింది.. అమెరికా ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇరాన్ పై ప్రయోగిస్తోంది.హర్మూజ్ జలసంధిని మూసేసి అటు ఇరాన్, ఇటు చైనా.. రెండు దేశాలకు షాక్ ఇస్తోంది. దీంతో ఇప్పటి వరకు హర్మూజ్ ఇరాన్ కంట్రోల్ లో ఉండగా సోమవారం సాయంత్రం నుంచి సీన్ మారిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఎన్నా గల్ఫ్ వార్ లో కాల్పుల విరమణ ఒట్టిదే అని తేలిపోయింది.
హర్మూజ్ జలసంధిలో ఇక ఇరాన్ కు వెళ్లే నౌకలు, ఇరాన్ నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ప్రకటించింది అమెరికా.దీంతో ఇతర దేశాలకు కూడా చిక్కులు వస్తాయేమో అనే అనుమానాలు వ్యక్తం కాగా ఈ బ్లాకేడ్ కేవలం ఇరాన్ కి రాకపోకలు సాగించే దేశాలపైనే అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు.దీంతో ఇరాన్ మినహా ఇతర దేశాలకు వెళ్లే నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్చగా ప్రయాణించొచ్చు. అయితే ఇది చెప్పినంత ఈజీగా కాదు.తమ నౌకలను నిర్బంధిస్తే తామూ ప్రతీకారానికి దిగడానికి రెడీ అంటోంది ఇరాన్.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్‌లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









