అమెరికా దిగ్బంధనం: హోర్ముజ్ జలసంధి వద్ద ఉత్కంఠ
- April 15, 2026
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఇరాన్ లక్ష్యంగా అమెరికా విధిస్తున్న నౌకా దిగ్బంధనం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. అమెరికా ఆంక్షలను ధిక్కరించి వెళ్లాలని చూసిన నౌకలు చుక్కెదురై వెనుదిరుగుతున్నాయి. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ‘రిచ్ స్టార్రీ’ అనే ట్యాంకర్, హోర్ముజ్ జలసంధిని దాటి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ ట్యాంకర్ సుమారు 2,50,000 బ్యారెళ్ల మెథనాల్‌ను మోసుకెళ్తోంది. ఇది చైనాకు చెందిన షాంఘై జువాన్రన్ షిప్పింగ్ కంపెనీకి చెందినది. ఇరాన్‌తో వ్యాపార సంబంధాల కారణంగా దీనిపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది.అమెరికా యుద్ధ నౌకల హెచ్చరికలతో ఈ ట్యాంకర్ బుధవారం తిరిగి గల్ఫ్ ప్రాంతానికే వెనుదిరిగింది.
శాంతి చర్చలు విఫలమైన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ దిగ్బంధనం అత్యంత కఠినంగా అమలువుతోంది. దిగ్బంధనం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో ఒక్క నౌక కూడా నిబంధనలను అతిక్రమించి వెళ్లలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దళాల ఆదేశాలతో దాదాపు ఆరు నౌకలు తమ మార్గాన్ని మార్చుకుని ఇరాన్ ఓడరేవులకు తిరిగి వెళ్లాయి.
ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర ఆందోళన నెలకొంది. యుద్ధానికి ముందు రోజుకు 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ఇప్పుడు రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. యుద్ధ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, నౌకలకు ఇన్సూరెన్స్ ఇచ్చే సంస్థలు భారీగా ప్రీమియంలను పెంచడం లేదా రక్షణ కల్పించడానికి నిరాకరించడం చేస్తున్నాయి. అలిసియా’ వంటి భారీ చమురు ట్యాంకర్లు ఇప్పటికీ ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!









