బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- April 16, 2026
మనామా: బహ్రెయిన్ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లిబియా ఆంక్షల కమిటీ పదవీకాలాన్ని ఆగస్టు 1, 2027 వరకు పొడిగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
లిబియాపై మండలి పెన్హోల్డర్గా యునైటెడ్ కింగ్డమ్ సమర్పించిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. లిబియా స్థిరత్వానికి, దాని వనరుల పరిరక్షణకు, ఆర్థిక అభివృద్ధికి తన మద్దతును పునరుద్ఘాటిస్తూ బహ్రెయిన్ అనుకూలంగా ఓటు వేసింది.
ఈ తీర్మానంలో ముడి మరియు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులతో సహా లిబియా చమురు అక్రమ ఎగుమతిని నిరోధించే చర్యలు ఉన్నాయి. ఇది దేశ సహజ వనరులను పరిరక్షించే ప్రయత్నాలను కూడా బలపరుస్తుంది. లిబియన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. జాతీయ ఆస్తులు లిబియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా యంత్రాంగాలను పటిష్టం చేయనుందని పేర్కొన్నారు.
లిబియా ఆంక్షల కమిటీని మొదటగా 2011లో తీర్మానం 1970 కింద ఆయుధాల నిషేధం, ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలు వంటి ఆంక్షలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. లిబియా నుండి చట్టవిరుద్ధంగా చమురును ఎగుమతి చేసే ప్రయత్నాలను అరికట్టడానికి 2014లో కమిటీ అధికార పరిధిని విస్తరించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









