సొంత కార్గో విమానాన్ని ఏర్పాటు చేసుకున్న అమెజాన్
- August 05, 2016
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇక నుంచి వస్తువులను తన సొంత కార్గో విమానం 'ప్రైమ్ ఎయిర్' బ్రాండ్ ద్వారా రవాణా చేయనుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ద్వారా అమెజాన్ వస్తువులను డెలివరీ చేస్తోంది. సరకు రవాణా వ్యవస్థ మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తూ సొంత కార్గో విమానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఒక్క 2015లో అమెజాన్ బిలియన్కు పైగా పార్సిల్స్‌ను డెలివరీ చేసింది. కాగా, ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్ అంతకు మూడేళ్ల ముందే అన్ని పార్సిల్స్‌ను డెలివరీ చేయటం గమనార్హం.
అమెజాన్ 2013లో సరకు డెలివరీకి సంబంధించి సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా అనేక మంది అమెజాన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాల ద్వారా సరకును వినియోగదారులకు సకాలంలో అందించలేకపోయింది. దీంతో అప్పటి నుంచి డెలివరీ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అట్లాస్ ఎయిర్‌కు చెందిన 40కి పైగా బోయింగ్ విమానాలను అద్దెకు తీసుకుని సరకు రవాణాకు వినియోగిస్తోంది. తాజాగా సొంత కార్గో విమానాన్ని ఏర్పాటు చేసుకుంది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







