విరుద్ధంగా డిపాజిట్ల సేకరణను నిరోధించే 'సాచెట్‌'

- August 05, 2016 , by Maagulf
విరుద్ధంగా డిపాజిట్ల సేకరణను నిరోధించే 'సాచెట్‌'

చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణను నిరోధించే దిశగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ 'సాచెట్‌' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆర్‌బీఐ నియమ నిబంధనలు అనుసరించి డిపాజిట్లు సేకరించే అధికారం ఎవరికి ఉందో తెలియజేసే సమాచారం, అక్రమంగా వసూలు చేసేవారిపై ఫిర్యాదు చేసే అవకాశం ఈ వెబ్‌సైట్‌ ద్వారా కలుగుతుంది.
వెబ్‌సైట్‌ ప్రారంభించిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ముఖ్యంగా డిపాజిట్ల సేకరణ విషయంలో సంస్థలు అనుసరిస్తున్న నియమ నిబంధనల గురించి ఈ వెబ్‌సైట్‌ ప్రజలకు సమాచారం అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించే సంస్థలపై ఫిర్యాదు చేసే వెసులుబాటు ఇందులో ఉందన్నారు.
వివరాలకు www.sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com