తెలంగాణలో వడగళ్ల వాన
- April 19, 2026
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలకు విరామం ఇస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా 44-45 డిగ్రీల ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు అకాల వర్షాలు ఉపశమనాన్ని కలిగించాయి.హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వడగళ్లు కురిసాయి. అయితే, ఉరుములు, మెరుపులతో పాటు కురిసిన భారీ వడగళ్ల వాన పలు జిల్లాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









