బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- April 19, 2026
విరుధునగర్: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సాత్తూరు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని పలు గదులు దెబ్బతిన్నాయి. మృతుల్లో పలువురు మహిళా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను విరుధునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణసంచా యూనిట్ గోవందనల్లూరుకు చెందిన ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు రామచంద్రన్, తంగమ్ తెన్నరసును ఆదేశించారు..
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







