వడ్డీ రేట్లను తగ్గించిన బ్రిటన్‌

- August 05, 2016 , by Maagulf
వడ్డీ రేట్లను తగ్గించిన బ్రిటన్‌

బ్రిటన్‌ ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించింది. 2009 మార్చి తర్వాత మొట్టమొదటిసారిగా వడ్డీరేట్లను తగ్గిస్తూ గురువారం ఒక ప్రకటన వెలువడింది. బ్రెగ్జిట్‌ ఓటు నేపథ్యంలో ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు గానూ 170 బిలియన్ల పౌండ్‌ స్టెర్లింగ్‌ల విలువ చేసే ఎమర్జన్సీ ప్యాకేజీని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వెలువరించింది. ఇదివరకెన్నడూ లేని విధంగా 0.5శాతం నుండి 0.25శాతానికి వడ్డీ రేట్లను తగ్గించడానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆర్ధిక సంక్షోభం తారా స్థాయిలో వున్నపుడు 2009 మార్చిలో చివరిసారిగా వడ్డీ రేట్లను తగ్గించారు. నూతన వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థకు ఇటువంటి చర్యలు అవసరమని, ఇటువంటి చర్యల వల్ల ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌ మార్క్‌ కేర్నీ చెప్పారు. సకాలంలో, సమగ్రంగా, సమన్వయంతో ఈ ప్యాకేజీని బ్యాంక్‌ తీసుకువచ్చిందని, వడ్డీ రేట్లలో కోత ప్రభావం తక్షణమే ఆర్ధిక వ్యవస్థలో కనిపిస్తుందని చెప్పారు. బ్రిటన్‌ ఇప్పుడు ఆర్ధిక మాంద్యాన్ని నివారించాల్సి వుందన్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా అధిక నిరుద్యోగం, ఇళ్ళ ధరలు పడిపోవడం వంటివి జరగవచ్చని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com