రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!

- April 21, 2026 , by Maagulf
రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!

దోహా: రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కార్యకలాపాలను నియంత్రించడానికి ఉద్దేశించిన 2017 నాటి చట్టం నెం. 22లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని షూరా కౌన్సిల్ సమీక్షించింది. ఈ ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం సూచించగా.. దీనిని షురాకౌన్సిల్ న్యాయ మరియు శాసన వ్యవహారాల కమిటీ అధ్యయనం చేసి కౌన్సిల్‌కు నివేదిక సమర్పించింది. 

రియల్ ఎస్టేట్ లీజులకు సంబంధించిన 2008 నాటి చట్టం నెం. 4లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టంపై న్యాయ మరియు శాసన వ్యవహారాల కమిటీ నివేదికను సమీక్షించి, దానిలోని నిబంధనలను చర్చించిన అనంతరం, కౌన్సిల్ దానిని ఆమోదించి, ప్రభుత్వానికి రిఫర్ చేసింది. వయోవృద్ధులకు సేవలు మరియు ప్రత్యేక హక్కుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనపై సామాజిక వ్యవహారాలు, కార్మిక మరియు గృహనిర్మాణ కమిటీ సమీక్షించింది.  దీనితోపాటు పలు అంశాలపై కౌన్సిల్ చర్చించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com