ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- April 21, 2026
గూడూరు: పూజ్య గురూజీ రామ్ రతన్ జీ జయంతి సందర్భంగా గూడూరు దత్త క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంలో 101వ అహోరాత్ర మహాయజ్ఞం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాయజ్ఞం పూజ్య మాతాజీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగింది.
యజ్ఞంలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించగా, భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. గురూజీ రామ్ రతన్ జీ తనయుడు పవన్ కుమార్ దంపతులు స్వయంగా హోమ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గురూజీ ఆశీస్సులు పొందేందుకు క్షేత్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పూజ్య మాతాజీ మాట్లాడుతూ, గురూజీ రామ్ రతన్ జీ బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన చూపిన ధర్మమార్గాన్ని అనుసరించడం ద్వారా శాంతి, సుఖసమృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
మహాయజ్ఞం సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందడంతో పాటు సమాజంలో ఐక్యత, సేవాభావం పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







