విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!

- April 21, 2026 , by Maagulf
విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!

మనామా: లోకలైజ్డ్ ఉద్యోగాలలో విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ జాతీయులను నియమించడానికి మద్దతుగా, ప్రభుత్వం మద్దతు ఇచ్చే తాత్కాలిక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ఒక అత్యవసర ప్రతిపాదనను పార్లమెంట్ మందు పెట్టారు. కొత్త నియామకాలకు కాకుండా నేరుగా ఉద్యోగాల భర్తీకి మద్దతు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక మార్కెట్ నియంత్రణ అథారిటీ (LMRA) మరియు తమ్కీన్‌లను కోరారు.

ఈ ప్రణాళిక ప్రకారం, ఒక యజమాని ఒక పదవి నుండి విదేశీ కార్మికుడిని తొలగించి, అదే స్థానంలో అర్హత కలిగిన బహ్రెయిన్ వాసిని నియమించినప్పుడు మాత్రమే ఆర్థిక మరియు ఉపాధి మద్దతు అందించాలని సూచించారు. ఈ మద్దతు బహ్రెయిన్ వాసులకు ఉద్యోగ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుందన్నారు. 

కొన్ని వ్యాపారాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్లకు ఇది పరిష్కారంగా ఉంటుందని డాక్టర్ సెరూర్ అన్నారు. పౌరులకు ఉపాధి అవకాశాలను పెంచుతూనే, సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్మిక మార్కెట్ స్థానికీకరణకు వేగవంతమైన విధానమని ఆయన తెలిపారు.

కార్మిక మార్కెట్‌లో వేగవంతమైన ఫలితాలను సాధించడానికి, ఇప్పటికే ఉన్న తమ్కీన్ కార్యక్రమాలను మరింత మెరుగ్గా, ఒక నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలని కూడా ఈ ప్రతిపాదన సూచిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com