తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం

- April 21, 2026 , by Maagulf
తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఓటర్ల చేతుల్లో ఉంది.గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన మైకులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు మూగబోయాయి. ఏప్రిల్ 23 (గురువారం) నాడు రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు.

ప్రచార చివరి రోజున ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కోలత్తూరులో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. ‘మరోసారి డీఎంకే’ నినాదంతో ఆయన ఓటర్లను అభ్యర్థించారు.విపక్ష నేత పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరి రెండు రోజులు తమిళనాడులో పర్యటించడం విశేషం. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com