ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- April 23, 2026
అనంతపురం: ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ కొందరు అందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మహిళలు ఇలాంటి నేరాల్లో ప్రధాన నిందితులుగా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తాజాగా అనంతపురం పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వీరిలో ప్రధాన నిందితురాలు సహా మరో ముగ్గురు మహిళలతో పాటు రాజేష్ అనే వ్యక్తి ఉన్నారు.
డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన హనీట్రాప్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో కింగ్ పిన్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మ అనే మహిళ కావడం విశేషం. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో నలుగురు మహిళలతో పాటు రాజేష్ అనే వ్యక్తి కూడా ఉన్నారు.
ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ గ్యాంగ్ మీద కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు పలువురిని హనీట్రాప్ చేసి లక్షల్లో వసూలు చేసింది. నిందితుల్లో చిన్ని నాయుడమ్మ, దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారి ఉన్నారు. ఈ ఐదుగురి నుంచి రూ. 13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు 20 మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు హనీట్రాప్ పేరుతో సుమారు రూ. కోటి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ మొత్తం నుంచి ఇప్పటి వరకు రూ. 13 లక్షలు రికవరీ చేశారు. దీంతో పాటు నిందితుల బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారు.
8-10 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారని తెలిపిన పోలీసులు.. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అలానే ఈ కేసులో పోలీసులకున్న సంబంధాలపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







