సెప్టెంబర్ 4న విడుదలకానున్న 'రుద్రమేదేవి'
- July 24, 2015
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ద్విభాష చిత్రంగా ఈ సినిమాను తీశామని తెలిపారు. తన కుటుంబ సభ్యులు, హీరోయిన్ అనుష్కతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో చెబుతామన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. 3డీ సీజీ టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగి పోయారని, సినిమాలో ఈ పాత్ర గంటసేపు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







