టిబెట్‌ను భారత్, నేపాల్‌తో అనుసంధానిస్తూ హిమాలయన్ రైల్వే మార్గాo..
- August 05, 2016
టిబెట్‌ను భారత్, నేపాల్‌తో అనుసంధానిస్తూ హిమాలయన్ రైల్వే మార్గాన్ని నిర్మించడం ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యమేనని చైనా అధికారులు తెలిపారు. చైనాను దక్షిణాసియాతో అనుసంధానించి టిబెట్‌ను ఆర్థిక, సాంస్కృతిక హబ్‌గా తీర్చిదిద్దాలని చైనా భావిస్తున్న నేపథ్యంలో ఈ యోచనను చేస్తున్నారు. ప్రతిపాదిత హిమాలయన్ రైల్వే.. టిబెట్‌లోని క్సిగాజే నగరంలో ప్రారంభమవుతుంది. చైనా సరిహద్దుల్లోని గిరోంగ్ గుండా సాగుతూ నేపాల్ వరకూ విస్తరిస్తుంది. ఇది హైస్పీడ్ రైల్వే కాదని చైనా పరిశోధకులను ఉటంకిస్తూ అధికారికపత్రిక 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. చైనా ఇప్పటికే టిబెట్‌లోని ఎగువ ప్రాంతాన్ని దేశంలోని మిగతా భాగాలతో అనుసంధానిస్తూ 1100 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించింది. దాన్ని విస్తరించి క్సిగాజే నగరం వరకూ మార్గాన్ని వేసింది. ఈ క్రమంలో టిబెట్ రాజధాని లాసాను అనుసంధానించింది. నేపాల్‌ను సిక్కింసరిహద్దుల్లో ఉన్న టిబెట్ పట్టణం యాడాంగ్కు దీన్ని విస్తరించాలని భావిస్తోంది. భవిష్యత్‌లో దాన్ని భారత్‌తోనూ అనుసంధానించే అవకాశం ఉందని చైనా అధికారులు చెబుతున్నారు. క్షిగాజే నుంచి నేపాల్ సరిహద్దు వరకూ రైల్వే మార్గాన్ని విస్తరించే ప్రాజెక్టుకు నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి అంగీకారం తెలిపారు. సరకుల సరఫరా కోసం భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి దీనికి సమ్మతి తెలిపారు. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రచండ ప్రధానయ్యారు. భారత ప్రయోజనాలకూ ఆయనప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు. దీంతో రైల్వేప్రాజెక్టు భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడిందని చైనా అధికారá చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







