భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- November 03, 2026
అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, దేశంలో పెరిగిన దిగుమతి సుంకాల నేపథ్యంలో భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఆందోళనకర రీతిలో పెరిగింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోకి ఏకంగా 50 మెట్రిక్ టన్నుల బంగారం స్మగ్లింగ్ ద్వారా వచ్చిందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) గణాంకాలను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో కేవలం 3 టన్నుల బంగారం మాత్రమే అక్రమ మార్గంలో రాగా, ఈసారి ఏకంగా 1500 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. 2023 సంవత్సరం తర్వాత ఈ స్థాయి భారీ మొత్తంలో పసిడి అక్రమ రవాణా జరగడం ఇదే తొలిసారి అని నివేదిక స్పష్టం చేసింది.
స్మగ్లింగ్‌కు ప్రధాన కారణాలు ఇవే!
ప్రపంచంలో బంగారం వినియోగంలో భారత్ రెండవ స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే అక్రమ రవాణా ఇంతగా పెరగడానికి వెనుక ప్రధాన కారణాలు ఇవే.
దిగుమతి సుంకాల పెంపు: పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ బలహీనపడటంతో ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో 6 శాతంగా ఉన్న సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచింది.
పన్నుల ఎగవేత: అధిక సుంకాల వల్ల బంగారం ధర భారంగా మారడంతో, పన్నులు తప్పించుకోవడానికి స్మగ్లర్లు కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు.
ధరల దెబ్బకు పడిపోయిన బంగారం డిమాండ్
మరోవైపు దేశంలో బంగారం అధికారిక డిమాండ్ గణనీయంగా తగ్గింది. WGC నివేదిక ప్రకారం..జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162.5 టన్నులుగా నమోదైంది. (2025 ఇదే త్రైమాసికంలో ఇది 229.8 టన్నులుగా ఉండేది). పెరిగిన దిగుమతి సుంకాలు, ధరల పెరుగుదలతో పాటు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలంటూ ప్రధాని మోదీ చేసిన పిలుపు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
పరిమాణం తగ్గినా, రికార్డు ధరల కారణంగా డిమాండ్ విలువ మాత్రం గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. 2026 పూర్తి సంవత్సరానికి దేశంలో బంగారం డిమాండ్ 625 నుండి 675 టన్నుల మధ్య ఉండవచ్చని WGC అంచనా వేసింది.
తాజా వార్తలు
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు
- ఇరాన్‌లోని పరారీలో ఉన్న ఉగ్రవాదులకు సహకారం..ముగ్గురికి జీవిత ఖైదు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!







