కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- April 25, 2026
కువైట్: కువైట్ ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పేలుడు పదార్థాలు అమర్చిన రెండు డ్రోన్లతో దాడి జరిగిందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఫైబర్ ఆప్టిక్ వైర్ల ద్వారా నియంత్రించబడిన ఈ డ్రోన్లు ఇరాక్ నుండి బయలుదేరి సరిహద్దు పోస్టులను ఢీకొట్టాయని, దీనివల్ల ఆస్తి నష్టం సంభవించిందని అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వన్ తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన ధృవీకరించారు. దాడి ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా, కువైట్ పై డ్రోన్ దాడిని గల్ఫ్ దేశాలు ఖండించాయి. ఇలాంటి దాడులు ప్రాంతీయ భద్రతకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించాయి.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









