బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!

- April 25, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!

మనామా: బహ్రెయిన్ రక్షణ దళంలోని అన్ని శాఖలు మరియు విభాగాల పోరాట సన్నద్ధత, కార్యాచరణ సన్నద్ధతపై సాయుధ దళాల చీఫ్ సమీక్షించారు. సాయుధ దళాల సర్వోన్నత కమాండర్ అయిన కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అందిస్తున్న నిరంతర మద్దతు, యువరాజు ప్రధానమంత్రి మహారాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నిశిత పర్యవేక్షణ కారణంగా అన్ని సైనిక విభాగాలు అత్యున్నత స్థాయి సన్నద్ధతను కొనసాగిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

బహ్రెయిన్ రక్షణ దళ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని, విజయాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవలి ప్రాంతీయ పరిణామాల సమయంలో వాయు రక్షణ వ్యవస్థలు చూపిన బలమైన పనితీరును ప్రస్తావిస్తూ, వాటి కీలక పాత్రను కూడా ఆయన అభినందించారు. అనేక వైమానిక ముప్పులను అడ్డుకుని నిర్వీర్యం చేయగల వారి సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. బహ్రెయిన్ రక్షణ వ్యవస్థల అధునాతన సామర్థ్యాన్ని, అధిక సంసిద్ధతను తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com