అగ్రనేతల మధ్య ముదిరిన విభేదాలు

- April 25, 2026 , by Maagulf
అగ్రనేతల మధ్య ముదిరిన విభేదాలు

అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరాన్ అగ్రనేతల మధ్య వ్యూహాత్మక వైఖరిపై తీవ్రమైన భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం అమెరికాతో చర్చల్లో కొంత సరళతరమైన వైఖరిని అవలంభించాలని, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రాజీ పడాలని భావిస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ అహ్మద్ వాహిది నేతృత్వంలోని ఈ బృందం అమెరికా పట్ల కఠినంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచకూడదని పట్టుబడుతోంది.

అమెరికాకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’ (ISW) విశ్లేషణ ప్రకారం, ఈ అంతర్గత పోరులో ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ వాహిది విజేతగా నిలిచారు. చర్చల బృందంపై తన పట్టును నిరూపించుకుంటూ, అమెరికాతో రాజీపడని వైఖరిని ప్రదర్శించేలా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఘాలిబాఫ్ ప్రతిపాదించిన రాయితీలను వాహిది బృందం పదేపదే అడ్డుకోవడంతో మితవాద వర్గం డీలా పడింది. అంతర్గత విభేదాలు మరియు ఐఆర్‌జీసీ ఆధిపత్యంతో విసుగు చెందిన స్పీకర్ ఘాలిబాఫ్ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాకు ఇచ్చే మినహాయింపుల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆయన ఇప్పటికే చర్చల బృందం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com