ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!

- April 26, 2026 , by Maagulf
ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!

కువైట్ః ప్రపంచవ్యాప్త “ఏక్ పెడ్ మా కే నామ్” ప్రచారంలో భాగంగా కువైట్‌లోని దావూదీ బోహ్రా సమాజం సహకారంతో  సల్మియా గార్డెన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పరామిత త్రిపాఠి నాయకత్వం వహించగా.. దావూదీ బోహ్రా సమాజ నాయకుడైన పరమ పావన సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్  కువైట్ ముఖ్య ప్రతినిధి అబి తమీమ్ హుసాముద్దీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దావూదీ బోహ్రా సమాజానికి చెందిన 100 మందికి పైగా సభ్యులు, హవల్లీ గవర్నర్ కార్యాలయ డైరెక్టర్ అబ్దుల్లా ముర్తాజీ, హవల్లీ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ హసన్ దాష్టి కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 450 కాఫ్ మరియం మొక్కలను మరియు 11 అకేసియా గలేటియా చెట్లను నాటారు. ఈ కార్యక్రమం..పటిష్టమైన, సుస్థిరమైన మరియు సంపన్నమైన సమాజాన్ని పెంపొందించే లక్ష్యంతో దావూదీ బోహ్రా సమాజం చేపట్టిన ప్రపంచ కార్యక్రమమైన “ప్రాజెక్ట్ రైజ్”లో కూడా ఒక భాగమని ప్రకటించారు.

“ఏక్ పెడ్ మా కే నామ్” ప్రచారాన్ని భారత ప్రధాని మడ నరేంద్ర మోదీ 2024, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ సుస్థిరతలో దావూదీ బోహ్రా సమాజం పోషిస్తున్న చురుకైన పాత్రను రాయబారి త్రిపాఠి ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు స్థానిక పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా భారత్, కువైట్ మధ్య సంబంధాలను కూడా బలపరుస్తాయని ఆమె పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com