ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- April 26, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పరిరక్షించేందుకు ఒక సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ వెల్లడించారు.
కార్యకలాపాల పునఃప్రారంభానికి ముందు కొనసాగుతున్న భద్రతా సన్నాహాల్లో భాగంగా అల్-వహిబ్ విమానాశ్రయంలో పర్యటించారు. భద్రతా సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. ప్రయాణికుల సురక్షిత రాకపోకలు సాగించేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రస్తుత దశలో మరింత అప్రమత్తత అవసరమని, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా వివిధ భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అల్-వహిబ్ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతోపాటు పాస్‌పోర్ట్ చెకింగ్ కౌంటర్లను పరిశీలించారు. అంతకుముందు ఆయనకు సహాయక భద్రతా సేవల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ దాడుల కారణంగా ఫిబ్రవరి 28 నుండి ఎయిర్ స్పేస్ పై అమల్లో ఉన్న నిషేధాన్నితాజాగా పౌర విమానయాన అథారిటీ ఎత్తివేసింది. దీంతో కువైట్ విమానాయశ్రయంలో కార్యాకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







