చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- April 26, 2026
చెన్నై: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచ్చింది. సాయి సుదర్శన్ తన అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై కోటలో గుజరాత్ జెండా పాతాడు.37వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెలరేగిపోయింది. చెన్నైతో జరిగిన పోరులో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్.. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/25)మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్‌కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం గుజరాత్ టైటాన్స్ ఓవర్లలో 159 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33), జోస్ బట్లర్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్)రాణించారు. నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ చెరో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో పరాజయం.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







