సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- April 27, 2026
రియాద్ః సౌదీ అరేబియాలోని వారసత్వ పట్టణాలను పునరుజ్జీవింపజేయడానికి త్వరలో ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభం కానుంది. గ్రామాలు మరియు చారిత్రక ప్రదేశాలకు కొత్త జీవం పోసి, వాటిని సాంస్కృతిక, పర్యాటక మరియు ఆర్థిక గమ్యస్థానాలుగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని హెరిటేజ్ కమిషన్ ప్రకటించింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా సుమారు 562 ప్రైవేట్ యాజమాన్యంలోని వారసత్వ పట్టణాలు మరియు గ్రామాలు ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
160కి పైగా వారసత్వ ప్రదేశాలలో పునరుద్ధరణ కార్యక్రమాలను అమలు చేసినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. ఆయా భవనాలు మరియు కళాఖండాలకు భంగం కలగకుండా, వాటి జీవితకాలాన్ని పొడిగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గతంలో వారసత్వ ప్రదేశాలను పునరుద్ధరించడానికి 37 సమీకృత ప్రాజెక్టులను పూర్తి చేసినట్ల పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులలో ఖుబా కోట, అల్-ఉయున్ కోట, ఉర్వా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు ఖిష్లా ప్యాలెస్, అల్-బహా ప్రాంతంలోని అల్-అతవ్లా ప్రదేశాలు, షక్రా, అల్-షిక్రా పట్టణాల వంటి అనేక ప్రముఖ చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయన్నారు. 100కు పైగా వారసత్వ పట్టణాలు కేటగిరీ Aగా వర్గీకరించబడ్డాయని, ఇది వాటి చారిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







