ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- April 27, 2026
ముంబై: ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాత్రి వరకు బంధువులతో కలిసి సంతోషంగా గడిపిన వారు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ముంబైలోని పైధోనీ ప్రాంతంలో నివసించే అబ్దుల్లా డొకాడియా (40), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13) తమ బంధువులను రాత్రి విందుకు ఆహ్వానించారు. అందరూ కలిసి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత, అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పుచ్చకాయ ముక్కలను తిన్నారు. అయితే, తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఒక్కొక్కరికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే జేజే ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ నలుగురూ కన్నుమూశారు.
ఈ మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారు తిన్న బిర్యానీ వికటించిందా (Food Poisoning) లేక బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏవైనా రసాయనిక చర్యలు జరిగాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. సాధారణంగా బిర్యానీ వంటి భారీ ఆహారం తిన్న వెంటనే పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే, బంధువులందరూ బిర్యానీ తిన్నా కేవలం పుచ్చకాయ తిన్న ఈ నలుగురే మరణించడంతో, పుచ్చకాయలో ఏవైనా పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయా లేదా అది పాడైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘోర కలికలంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించడంతో పాటు, వారు తిన్న ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అబ్దుల్లా కుటుంబం ఏ దుకాణం నుంచి బిర్యానీ తెప్పించారు, పుచ్చకాయ ఎక్కడ కొన్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగా లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అనేది స్పష్టమవుతుందని అధికారులు వెల్లడించారు. ఒకే కుటుంబం ఇలా అంతమైపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









