షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- April 28, 2026
షార్జా: ఈ వారం దిబ్బా అల్ హిస్న్ లో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ ను ప్రారంభించడానికి షార్జా సిద్ధమవుతోంది. షార్జా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాజెక్ట్, మొత్తం 6,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
మహిళల కోసం మూడు ప్రత్యేక బీచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. ఈ క్రమంలో ఇది మొదటిది. దీనితోపాటు కల్బా మరియు ఖోర్ఫక్కన్‌లలో కూడా మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ లను సిద్ధం చేస్తున్నారు.
దిబ్బా అల్ హిస్న్ బీచ్ "మోడల్ ప్రాజెక్ట్"గా అభివృద్ధి చేయబడిందని, పూర్తి గోప్యత కోసం పూర్తిగా మూసివున్న లేఅవుట్‌ను కలిగి ఉందని పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ చైర్మన్ అలీ బిన్ షహీన్ అల్ సువైది తెలిపారు.
ఈ బీచ్‌ఫ్రంట్‌కు అనుబంధంగా రెండు విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఫిట్‌నెస్ సెంటర్, క్రియేటివ్ యాక్టివిటీ హాల్, ఒక కేఫ్, పరిపాలనా కార్యాలయాలు, ఒక క్లినిక్, ప్రార్థనా గది మరియు గార్డ్ రూమ్‌లతో పాటు స్పోర్ట్స్, సామాజిక మరియు విశ్రాంతి కార్యకలాపాల కోసం ఒక సమగ్ర వాతావరణాన్ని అందించడానికి రూపొందించిన అనేక ఏర్పాటు ఉన్నాయని అన్నారు. వీటితోపాటు సురక్షితమైన రబ్బరు ఫ్లోరింగ్‌తో కూడిన నీడగల పిల్లల ఆట స్థలం, అలాగే ఫిట్‌నెస్ మరియు వినోద వినియోగానికి మద్దతుగా వాటర్‌ఫ్రంట్ వెంబడి విస్తరించి ఉన్న రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్ ప్రత్యేకత కలిగి ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్‌లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ









