కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!

- April 28, 2026 , by Maagulf
కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!

కువైట్: కువైట్ లో నియంత్రిత రంగాల నుండి కార్మికుల బదిలీకి అసలు యజమాని ఆమోదం తప్పనిసరి చేశారు.  ఈ మేరకు ఫస్ట్ ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిర్ణయం ప్రకారం.. యజమానులు మరియు కార్మికుల ప్రయోజనాలను బ్యాలన్స్ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్, ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ అన్నారు.

మే నెల ప్రారంభం నుండి జూన్ నెలాఖరు వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం, అసలు యజమాని నుండి తప్పనిసరి ఆమోదంతో సహా నిర్దిష్ట షరతులకు లోబడి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు,  వ్యవసాయం, పశు మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాల నుండి బదిలీలను అనుమతిస్తుంది.

అయితే, ఇది తాత్కాలికమైనది మరియు కఠినమైన నియంత్రణలకు లోబడి ఉంటుంది కాబట్టి, ఈ బదిలీలకు సంబంధించిన కార్మిక ఫిర్యాదులను అథారిటీ స్వీకరించదని అల్-ఒసైమీ స్పష్టం చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com