బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!

- April 29, 2026 , by Maagulf
బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!

మనామాః గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సుప్రీం కౌన్సిల్ సంప్రదింపుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధి బృందంతో సౌదీ అరేబియాకు చేరుకున్నారు. జెడ్డాకు చేరుకున్న కింగ్ హమద్ ప్రతినిధుల బృందానికి సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ యువరాజు సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్, జెడ్డా గవర్నర్ సలేహ్ అల్ తుర్కీ, బహ్రెయిన్‌లోని సౌదీ రాయబారి నయేఫ్ బిన్ బందర్ అల్ సుదైరీతో పాటు పలువురు సీనియర్ సౌదీ అధికారులు కూడా పాల్గొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com