పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- May 01, 2026
హైదరాబాద్: పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామాబాద్ కు చేరువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్ లో క్వింటాల్ పసుపునకు రూ.17 వేల ధర పలుకుతుందని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి రూ.13 వేలకు మించి ధర పెట్టడం లేదని, దీంతో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు ఉత్సవ విగ్రహంలా మారిందని.. స్పైసెస్ బోర్డును బలోపేతం చేసి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని పసుపు రైతులకు అండగా నిలవాలని కోరారు. వెంటనే ఆహార పంటల జాబితాలో పసుపును చేర్చి కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. నిజామాబాద్ మార్కెట్ లో ఇంకా లక్ష క్వింటాళ్లకు పైగా పసుపు పంట కొనుగోలు చేయాల్సి ఉందని, ఆ రైతులకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు.
ఇ–నామ్ 2.0 ప్రారంభ సమయంలో నిజామాబాద్ మార్కెట్ ను చేర్చకపోవడంతో పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తర్వాత ఇ–నామ్ 2.0లో నిజామాబాద్ మార్కెట్ ను చేర్చినా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతోనే గడిచిన ఏడేళ్లుగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో పసుపు పంట సాగు విస్తీర్ణ గణనీయంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









