బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- May 02, 2026
మనామా: తమ్కీన్ సహాయ పథకాల పరిధిలోకి రాని బహ్రెయిన్ కార్మికులను, ప్రస్తుత పరిస్థితుల వల్ల దెబ్బతిన్న కంపెనీల మద్దతు పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ మహమ్మద్ మూసా మరియు మరో నలుగురు ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదనను చేశారు.ఈ ప్రణాళిక, తమ్కీన్ సహాయం ఎన్నడూ అందుకోని బహ్రెయిన్ సిబ్బందితో పాటు గతంలో లబ్ధి పొంది, ప్రస్తుత పథకాల పరిధిలోకి రాని వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఒత్తిడిలో ఉన్న సంస్థలు బహ్రెయిన్ కార్మికులను తమ జీతాల జాబితాలో ఉంచుకోవడానికి సహాయపడటం, అదే సమయంలో వాళ్ల కుటుంబాలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని లేదా మొత్తం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపారు. కొన్ని వ్యాపారాలు పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున, అది వారి స్థానిక సిబ్బందిని నిలుపుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, అందుకే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టినట్లు ఎంపీలు తెలిపారు.
‘మద్దతు కార్యక్రమాల నుండి లబ్ధి పొందని, లేదా గతంలో లబ్ధి పొంది ప్రస్తుత మద్దతు పథకాలలో చేర్చబడని బహ్రెయిన్ ఉద్యోగులపై’ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా పడిందని ఆయన అన్నారు. ఈ అంతరం, ఇప్పటికే అధిక జీవన వ్యయాలు భరిస్తున్న కార్మికులలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచిందని ఎంపీ అన్నారు. ఇలాంటి పరిస్థులు కారణంగా బహ్రెయిన్ కుటుంబాలపై భారం మోపిందని, అర్హులైన కార్మికులందరినీ తమ్కీన్ సహాయం కిందకు తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్‌కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్‌లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









