బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్

- May 02, 2026 , by Maagulf
బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్

కువైట్ సిటీ: బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జ్లీబ్ అల్-షయూఖ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ప్రజా రవాణా సంస్థకు చెందిన టికెట్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణికుల వద్ద వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.

పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారి నేరాలను నిర్ధారించారు.

నిందితుల వద్ద నుంచి దొంగిలించినట్లు భావిస్తున్న 333 కువైట్ దీనార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజా రవాణా సేవలను ఉపయోగించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com