ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!

- May 02, 2026 , by Maagulf
ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయిని చేరుకోబోతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి ప్రాంతంలో డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో ఫిఫ్త్‌ జనరేషన్‌ స్టెల్త్‌ యుద్ధ విమాన ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

రూ.15,000 కోట్లతో మెగా ప్రాజెక్టు                                                                                              భారత రక్షణ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డీఆర్‌డీవో సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నాయి. సుమారు 15,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐదవ తరం యుద్ధ విమానాల అభివృద్ధి, తయారీ ప్రక్రియ కొనసాగనుంది.

DRDO Project Puttaparthi: 15న శంకుస్థాపన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు రాకతో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com