గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్

- May 02, 2026 , by Maagulf
గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ శనివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టినందుకు గవర్నర్ ఆయనకు అభినందనలు తెలిపారు.

అనంతరం వారిద్దరి మధ్య స్వల్ప సమావేశం జరిగింది. రాష్ట్ర శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల పై చర్చించారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com