రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!

- May 03, 2026 , by Maagulf
రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!

రియాద్ః సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకంపై నిషేధం విధించారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్టానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ (REGA) డైరెక్టర్ల బోర్డు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మరియు ప్రకటనల నిబంధనలను ఆమోదించింది.  

ఈ కొత్త నిబంధనల ప్రకారం, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగించడాన్ని నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించినట్లయితే ఆయా సంస్థల లైసెన్స్ రద్దు చేయబడుతుందని హెచ్చరించారు. దీనితోపాటు తప్పుదోవ పట్టించే సమాచారం లేదా డేటాను ప్రచురించడం లేదా లైసెన్స్ లేకుండా రియల్ ఎస్టేట్ ప్రకటనను జారీ చేయడం వంటివి కూడా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ నిబంధనల క్రింద ఉన్న ఉల్లంఘనలు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధిస్తారు.  
ఒక రియల్ ఎస్టేట్ ప్రకటనలో ఆస్తికి సంబంధించిన రకం, ప్రదేశం, విస్తీర్ణం మరియు విలువ వంటి ముఖ్యమైన వివరాలతో పాటు ఆస్తి విలువను లేదా కొనుగోలుదారు నిర్ణయాన్ని ప్రభావితం చేయగల ఏదైనా అదనపు సమాచారాన్ని కూడా చేర్చాలని నిర్దేశించారు. ఈ నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా, ప్రదర్శనలు మరియు బహిరంగ కార్యక్రమాలు, ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్‌లు,  బిల్‌బోర్డ్‌లతో సహా వివిధ మాధ్యమాలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com