విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- May 03, 2026
చెన్నై: షార్జా నుండి చెన్నై చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అయి రన్‌వే నుంచి పార్కింగ్ ఏరియాకు కదులుతున్న సమయంలో, పుదుక్కోట్టైకి చెందిన ఒక ప్రయాణికుడు ఊహించని విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు.
ఈ చర్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం చేయడంతో CISF సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రయాణంలో రెండు సార్లు వాంతులు చేసుకున్న అతడు, విమానం ఆగిన వెంటనే బయటపడటానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ ఘటన కారణంగా భద్రతా కారణ దృష్ట్యా ప్రధాన రన్‌వేను ఒక గంట పాటు మూసివేసి, విమానాలను ప్రత్యామ్నాయ రన్‌వేకు మళ్లించారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









