జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- May 03, 2026
కువైట్: జాయింట్ ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీ KNET జూన్ 5 నుండి అమలులోకి వచ్చేలా తన ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వేకు ఒక అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం, వినియోగదారులు మెనూ నుండి తమ బ్యాంకును ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా, తమ బ్యాంక్ కార్డ్ నంబర్‌ను నేరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది పేమెంట్ ప్రక్రియను సులభతరం చేసి, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.
డిజిటల్ చెల్లింపులలో ప్రపంచవ్యాప్త పురోగతికి అనుగుణంగా ఉండటమే ఈ మార్పు లక్ష్యమని KNET పేర్కొంది. ఇది భవిష్యత్తులో అదనపు చెల్లింపు పద్ధతులను అనుసంధానించడానికి కూడా వీలు కల్పిస్తుంది. తద్వారా తన ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను విస్తరించడం మరియు మెరుగుపరచడం అనే కంపెనీ విస్తృత లక్ష్యానికి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
డిజిటల్ మరియు ఆర్థిక సేవలలోని వివిధ రంగాలలో సరికొత్త సాంకేతికతలను ఉపయోగించుకుంటూ KNET అన్ని కువైట్ బ్యాంకులకు ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







