క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు ...

- August 07, 2016 , by Maagulf
క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు ...

క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఆత్కూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''స్వాతంత్య్ర పోరాట యోధుల స్వస్థలాలకు వెళ్లి కేంద్రమంత్రులు నివాళులర్పిస్తారు. సాంస్కృతిక విభాగం ప్రదర్శనలు నిర్వహిస్తుంది. దేశంలోని అన్నిపాఠశాలల్లో వ్యాసరచన, వేషధారణ పోటీలు నిర్వహిస్తాం. యువజన క్రీడల విభాగం మారథాన్‌లు నిర్వహిస్తుంది'' అని తెలిపారు. దేశం కోసం పోరాడిన మహనీయుల సేవలకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొని ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు.అంతకుముందు ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఏపీ డీజీపీ సాంబశివరావు పాల్గొని స్వర్ణభారతి ట్రస్ట్‌ సేవలను కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com