క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు ...
- August 07, 2016
క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా తిరంగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఆత్కూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''స్వాతంత్య్ర పోరాట యోధుల స్వస్థలాలకు వెళ్లి కేంద్రమంత్రులు నివాళులర్పిస్తారు. సాంస్కృతిక విభాగం ప్రదర్శనలు నిర్వహిస్తుంది. దేశంలోని అన్నిపాఠశాలల్లో వ్యాసరచన, వేషధారణ పోటీలు నిర్వహిస్తాం. యువజన క్రీడల విభాగం మారథాన్లు నిర్వహిస్తుంది'' అని తెలిపారు. దేశం కోసం పోరాడిన మహనీయుల సేవలకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొని ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు.అంతకుముందు ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ డీజీపీ సాంబశివరావు పాల్గొని స్వర్ణభారతి ట్రస్ట్ సేవలను కొనియాడారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







