దుబాయ్ మాల్‌ సహా 3 మాల్స్‌ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!

- May 04, 2026 , by Maagulf
దుబాయ్ మాల్‌ సహా 3 మాల్స్‌ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!

యూఏఈ: దుబాయ్ మాల్, దుబాయ్ హిల్స్ మాల్ మరియు మెరీనా మాల్‌లోని కీలక షాపింగ్ కేంద్రాలలో సరైన పార్కింగ్ సేవలను అమలు చేస్తామని పార్కిన్ ప్రకటించింది.  ఈ స్మార్ట్ పార్కింగ్ సొల్యూషన్స్ కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎమార్ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. దివ్యాంగుల పార్కింగ్ (PoD) సరైన వినియోగాన్ని నిర్ధారించడం, ట్రాఫిక్ ను మెరుగుపరచడం మరియు పార్కింగ్ సౌకర్యాల వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడం వంటి సరైన పార్కింగ్ మార్గదర్శకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించారు. 

ఒక వాహనం ప్రత్యేకంగా కేటాయించిన PoD బేలో పార్క్ చేసిన వెంటనే, చెల్లుబాటు అయ్యే PoD పర్మిట్ ఉందో లేదో ధృవీకరించడానికి పార్కిన్ AI-ఆధారిత అమలు వ్యవస్థ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఆటోమెటిక్ గా స్కాన్ చేస్తుందన్నారు. చెల్లుబాటు అయ్యే పర్మిట్ ఏదీ గుర్తించకపోతే, కంపెనీ కమాండ్ సెంటర్‌లోని పార్కిన్ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా జరిమానా నోటీసు జారీ అవుతుందని పార్కిన్ తన ప్రకటనలో వెల్లడించింది.

దుబాయ్ పార్కింగ్ నిబంధనలను సంపూర్ణంగా పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి పార్కిన్ మూడు సైట్‌లలో ప్రత్యేక ఫీల్డ్ తనిఖీలను నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com