అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!

- May 04, 2026 , by Maagulf
అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!

మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సెక్రటరీ జనరల్ రియాద్‌లో యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ మేరకు జిసిసి ఒక ప్రకటనలో తెలిపింది.

జిసిసి జనరల్ సెక్రటేరియట్‌లో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు (MEP) రైన్‌హోల్డ్ లోపట్కా నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహమ్మద్ అల్-బుడైవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు, రెండు కూటముల మధ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలను సమీక్షించాయి. పరస్పర ప్రయోజనాలకు దోహదపడే అభివృద్ధి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతునిచ్చే విధంగా గల్ఫ్-యూరోపియన్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు కొనసాగాయని జీసీసీ తెలిపింది.

ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అల్-బుడైవి అన్నారు. ఈ పర్యటన జిసిసి మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకార రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఇటీవలి ఇరాన్ దాడుల నేపథ్యంలో జీసీసీ దేశాలకు తమ మద్దతును యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృంద సభ్యులు పునరుద్ఘాటించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com