ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు జగదీశ్‌ గగనేజ్‌పై కాల్పులు..

- August 07, 2016 , by Maagulf
ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు జగదీశ్‌ గగనేజ్‌పై కాల్పులు..

పంజాబ్‌లో సీనియర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు జగదీశ్‌ గగనేజ్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జగదీశ్‌ అతని భార్యతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి జ్యోతి చౌక్‌ వద్ద ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన జగదీశ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. జగదీశ్‌పై దాడి నేపథ్యంలో దిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com