నూతన చేనేత విధానo తీసుకురానున్నట్లు కేటీఆర్ వెల్లడి..
- August 07, 2016
టెక్స్టైల్ రంగంతో ప్రమేయం లేకుండా త్వరలోనే నూతన చేనేత విధానాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం అన్ని రకాలు ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాలన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్... చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన 'చేనేత లక్ష్మి' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేత వస్త్రాలతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







