అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- May 08, 2026
కరీంనగర్: భక్తితో సమాజంలో మెదలాలని తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి వారి పరివారంతో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో వారి సారథ్యంలో బ్రహ్మశ్రీ .గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహింపబడేటువంటి సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని వేడుకగా సాంప్రదాయబద్ధంగా శ్రీరాముడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణంలోని సుందరకాండ కు ప్రత్యేకత ఉన్నదని మరియు రామాయణం యొక్క విశిష్టతను తెలియపరచినటువంటి సుందరకాండని ప్రతి ఒక్కరూ పట్టించాలని మరియు తెలుసుకోవాలని వారు చెప్పారు.వాల్మీకి మహర్షి రచించినటువంటి సుందరకాండ ద్వారా రామాయణం మొత్తం తెలుసుకోగలుగుతామని మరియు సీతను కనుగొనేందుకు హనుమంతుడు చేసినటువంటి ప్రయత్నాలను చాలా చక్కగా తెలుసుకోవచ్చని వారు చెప్పారు.
సుమారు 2000 శ్లోకాలు కలిగినటువంటి సుందరకాండలో అత్యద్భుతంగా విషయాలు తెలపడం జరిగిందని వారు చెప్పారు.ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సుందరకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకమని మరియు ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని భక్తి భావంతో మెదడాలని మరియు తోటి వారికి సహాయపడాలని సూచించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయతను, ఓపికను పెంపొందించుకొని అభివృద్ధి వైపు పయనించాలని వారు చెప్పారు
మరో ఆత్మీయ అతిథి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు సకల బలశాలని మరియు రాముని కొలిచినటువంటి తీరు నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు. సుందరకాండలోని విషయాల ద్వారా రామాయణం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలుగుతామని వారు చెప్పారు. హనుమంతుడు అంకితభావానికి నిర్వచనమని మరియు భక్తి భావానికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ వొంటల సత్యనారాయణ రెడ్డి పలువురు ఆలయాల కమిటీల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రవచనం అనంతరం పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి భజనలు భక్తి భావాన్ని పెంపొందించాయి మరియు ప్రాంగణాన్ని చక్కగా అలంకరించి పండుగ వాతావరణం వెల్లివిరిసే విధంగా చేశారు
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!







