అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- May 08, 2026
దోహా: మే 9న స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు మరియు అక్కడి నుండి రాకపోకలు సాగించే మెట్రోలింక్ మరియు మెట్రోఎక్స్‌ప్రెస్ సేవల సమయాల్లో మార్పులను దోహా మెట్రో ప్రకటించింది.
ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో జరిగే అమీర్ కప్ ఫైనల్ కారణంగా రోడ్లను మూసివేస్తుండటంతో ఈ తాత్కాలిక మార్పులు చోటుచేసుకున్నాయి. "ప్రభావితమయ్యే అన్ని మార్గాలలో సేవలు స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి నడుస్తాయి." అని ప్రకటించింది.
మెట్రోలింక్ సర్వీస్ M310 'అల్ వాబ్ QLM స్టేషన్, ఎగ్జిట్ 1' నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే M311 సర్వీస్ 'అల్ సుడాన్ బస్ స్టేషన్' నుండి, M317 బస్సులు 'అల్ వాబ్ QLM స్టేషన్, ఎగ్జిట్ 2' నుండి సర్వీసులు ఉంటాయని ప్రకటించారు.
ఇక స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు మరియు అక్కడి నుండి మెట్రోఎక్స్‌ప్రెస్ సేవల బుకింగ్‌లు ఆ రోజు వరకు నిలిపివేయబడతాయి. "స్పోర్ట్ సిటీ సేవా పరిధికి రాకపోకలు సాగించే ప్రయాణికులు, మెట్రోఎక్స్‌ప్రెస్ సేవలను స్పోర్ట్ సిటీకి బదులుగా 'అల్ వాబ్ QLM స్టేషన్' ద్వారా బుక్ చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







