అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్‌ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!

- May 08, 2026 , by Maagulf
అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్‌ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!

దోహా: మే 9న స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు మరియు అక్కడి నుండి రాకపోకలు సాగించే మెట్రోలింక్ మరియు మెట్రోఎక్స్‌ప్రెస్ సేవల సమయాల్లో మార్పులను దోహా మెట్రో ప్రకటించింది.

ఖలీఫా అంతర్జాతీయ స్టేడియంలో జరిగే అమీర్ కప్ ఫైనల్ కారణంగా రోడ్లను మూసివేస్తుండటంతో ఈ తాత్కాలిక మార్పులు చోటుచేసుకున్నాయి. "ప్రభావితమయ్యే అన్ని మార్గాలలో సేవలు స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి నడుస్తాయి." అని ప్రకటించింది.

మెట్రోలింక్ సర్వీస్ M310 'అల్ వాబ్ QLM స్టేషన్, ఎగ్జిట్ 1' నుండి స్టార్ట్ అవుతుంది.  అలాగే M311 సర్వీస్ 'అల్ సుడాన్ బస్ స్టేషన్' నుండి, M317 బస్సులు 'అల్ వాబ్ QLM స్టేషన్, ఎగ్జిట్ 2' నుండి సర్వీసులు ఉంటాయని ప్రకటించారు.

ఇక స్పోర్ట్ సిటీ స్టేషన్‌కు మరియు అక్కడి నుండి మెట్రోఎక్స్‌ప్రెస్ సేవల బుకింగ్‌లు ఆ రోజు వరకు నిలిపివేయబడతాయి. "స్పోర్ట్ సిటీ సేవా పరిధికి రాకపోకలు సాగించే ప్రయాణికులు, మెట్రోఎక్స్‌ప్రెస్ సేవలను స్పోర్ట్ సిటీకి బదులుగా 'అల్ వాబ్ QLM స్టేషన్' ద్వారా బుక్ చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com