ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆస‌క్తిక‌ర‌ ట్వీట్

- May 08, 2026 , by Maagulf
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆస‌క్తిక‌ర‌ ట్వీట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో సుమారు రూ.2,200 కోట్లతో అత్యాధునిక మోటార్‌సైకిళ్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాకను సీఎం చంద్రబాబు “రాయల్ ఎన్‌ఫీల్డ్ రాయలసీమలోకి దూసుకుపోతోంది! రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ” అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బుల్లెట్ బైక్ ఫొటోతో ఆయన పెట్టిన ఈ పోస్ట్ రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టు కోసం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వన్నెలూరు, రాళ్ళకుప్పం గ్రామాల్లో ప్రభుత్వం 267 ఎకరాల భూమిని కేటాయించింది. రెండు దశల్లో నిర్మించనున్న ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశను 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com