‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- May 08, 2026
చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ మార్కుకు స్వల్ప దూరంలో నిలిచినప్పటికీ.. కాంగ్రెస్ (5), సిపిఐ (2), సిపిఎం (2), విసికె (2), ఐయూఎంఎల్ (2) వంటి పార్టీలు విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించాయి. దీంతో బలం 121కి చేరి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 60 ఏళ్లకు పైగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ విజయ్ సాధించిన ఈ విజయం భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రేపే ప్రమాణ స్వీకారం–వేడుకకు ముస్తాబు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది. ‘విజయ్ అను నేను’ అంటూ ఆయన చేసే ప్రమాణాన్ని వినేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. రేపు కేవలం విజయ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మంత్రుల కూర్పుపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం నాడు మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తమిళ రాజకీయాల్లో చారిత్రక మలుపు
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న విజయ్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు, అవినీతి రహిత పాలన అందిస్తానని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేయగా, కొత్త ప్రభుత్వంపై అటు తమిళ జనం, ఇటు రాజకీయ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒక నటుడిగా ‘దళపతి’గా పిలవబడే విజయ్, ఇప్పుడు పాలకుడిగా తమిళనాడును ఏ దిశగా నడిపిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!









