IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్

- May 09, 2026 , by Maagulf
IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్

ఐపీఎల్ 2026 సీజన్ క్రేజ్ చూస్తుంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అచ్చం అసలు టికెట్లలాగే కనిపించే నకిలీ టికెట్లను సృష్టించారు. లక్నోలో జరుగుతున్న మ్యాచ్‌ల సందర్భంగా ఈ దందా బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. స్టేడియం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిసింది. చాట్‌జీపీటీ, అత్యాధునిక గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఈ టికెట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

స్టేడియం బయట టికెట్లు దొరకని అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా అధిక ధరలకు నకిలీ టికెట్లు అంటగట్టింది. ఒక అభిమాని వద్ద ఉన్న టికెట్ స్కాన్ కాకపోవడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా అధికారిక కౌంటర్లలోనే టికెట్లు కొనాలని పోలీసులు క్రికెట్ ప్రియులకు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com