IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- May 09, 2026
ఐపీఎల్ 2026 సీజన్ క్రేజ్ చూస్తుంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అచ్చం అసలు టికెట్లలాగే కనిపించే నకిలీ టికెట్లను సృష్టించారు. లక్నోలో జరుగుతున్న మ్యాచ్‌ల సందర్భంగా ఈ దందా బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. స్టేడియం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిసింది. చాట్‌జీపీటీ, అత్యాధునిక గ్రాఫిక్ సాఫ్ట్వేర్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఈ టికెట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్టేడియం బయట టికెట్లు దొరకని అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా అధిక ధరలకు నకిలీ టికెట్లు అంటగట్టింది. ఒక అభిమాని వద్ద ఉన్న టికెట్ స్కాన్ కాకపోవడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా లేదా అధికారిక కౌంటర్లలోనే టికెట్లు కొనాలని పోలీసులు క్రికెట్ ప్రియులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







